SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 1:35 am Posted by : SALAM PRODDATUR

కొవ్వూరు గ్రాండ్‌లో రాజకీయ ఆత్మీయత.. మంత్రి కందుల దుర్గేష్‌తో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి భేటీ!

 

 

 సలాం   ప్రొద్దుటూరు:

 

రాష్ట్ర మంత్రి  కందుల దుర్గేష్  ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా కొవ్వూరు గ్రాండ్‌కు విచ్చేసిన మంత్రిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజుల రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌తో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు.మంత్రి పర్యటన నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఇవి సుధాకర్ రెడ్డి, చౌటపల్లె లక్ష్మిరెడ్డి, జనసేన నాయకులు సుంకర మురళీ, మదాసు మురళీ, వంశీ, శ్రీనివాసుల రెడ్డి, చిరంజీవి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.మంత్రి కందుల దుర్గేష్ పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నాయకుల కలయికతో కొవ్వూరు గ్రాండ్‌లో ఆత్మీయ వాతావరణం నెలకొంది.