నామినేషన్ పత్రాల చించివేత ప్రజాస్వామ్యంపై దాడి
– ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దౌర్జన్యాలపై సీపీఎం ఆగ్రహం – ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గం –సీపీఎం నేత మనోహర్ ,సత్యం సలాం ప్రొద్దుటూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి నామినేషన్ పత్రాలను చించివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మనోహర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సీపీఎం...