ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన

  –పశుసంపద సంరక్షణ, పశుగ్రాస నిల్వలు, నీటి పొదుపుపై పశువైద్య నిపుణుల సూచనలు   సలాం ప్రొద్దుటూరు – కొర్రపాడు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశుసంపదను సంరక్షించుకోవడం, పశుగ్రాసాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, పశువుల్లో వేడి ఒత్తిడిని నివారించడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో కొర్రపాడు గ్రామంలో అవగాహన ర్యాలీ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డా. జి.ఆర్.కె. శర్మ ముఖ్య అతిథిగా హాజరై...