తాళ్లమాపురంలో సీతారామాలయ నిర్మాణానికి భూమిపూజ
–శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.40 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామంలో సీతారామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి భూమిపూజ చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, నంద్యాల ఆనంద్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో దేవాలయాల నిర్మాణం కీలకమని స్థానికులు...