SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 1:55 pm Posted by : SALAM PRODDATUR

తాళ్లమాపురంలో సీతారామాలయ నిర్మాణానికి భూమిపూజ

 

 

–శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.40 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామంలో సీతారామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి భూమిపూజ చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, నంద్యాల ఆనంద్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో దేవాలయాల నిర్మాణం కీలకమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పర సంఘం డైరెక్టర్ పేట చంద్రశేఖర్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లికార్జున, దండు శీను, కొండారెడ్డి, చంద్ర, శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, బాలసుబ్బరాయుడు, ప్రసాద్, తక్కులయ్య, నాగరాజు, గంగిరెడ్డి, పుల్లయ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.