డ్రైనేజీ పూడిక తొలగింపుతో వాహనదారులకు ఊరట
–మైదుకూరు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీబీతో శుభ్రపరిచిన మాజీ సర్పంచ్ సలాం ప్రొద్దుటూరు: కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మైదుకూరు రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్తపల్లి మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా శుభ్రపరిచారు. దీంతో వాహనదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.