₹7 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు..

–అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం – ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి   సలాం    ప్రొద్దుటూరు:   పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.₹7 కోట్ల వ్యయంతో గాంధీ రోడ్డు నుంచి రామేశ్వరం వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.100 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని...