SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 12:42 pm Posted by : SALAM PRODDATUR

₹7 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు..

–అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం

– ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

 

సలాం    ప్రొద్దుటూరు:

 

పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.₹7 కోట్ల వ్యయంతో గాంధీ రోడ్డు నుంచి రామేశ్వరం వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.100 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించిన ఆయన, మున్సిపాలిటీ నిధుల వినియోగంపై త్వరలో విచారణ జరిపిస్తామని తెలిపారు. పట్టణంలో పాత రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. మార్కెట్ ఆధునీకరణకు సంబంధించి తమ ప్రణాళికలను వివరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమమే తమ నినాదమని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.