“కామ్రేడ్ కళ్యాణ్” విజయోత్సవ సందడి
–ప్రొద్దుటూరు ప్రేక్షకులకు హీరో శ్రీ విష్ణు కృతజ్ఞతలు సలాం ప్రొద్దుటూరు: ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిత్ర కథానాయకుడు శ్రీ విష్ణు అన్నారు. మంగళవారం ప్రొద్దుటూరులోని అమీర్ సినిమా థియేటర్ను హీరో శ్రీ విష్ణుతో పాటు చిత్ర యూనిట్ సందర్శించింది. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాన్ని ఆదరిస్తూ...