SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 11:15 pm Posted by : SALAM PRODDATUR

“కామ్రేడ్ కళ్యాణ్” విజయోత్సవ సందడి

 

–ప్రొద్దుటూరు ప్రేక్షకులకు హీరో శ్రీ విష్ణు కృతజ్ఞతలు

సలాం ప్రొద్దుటూరు:

ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిత్ర కథానాయకుడు శ్రీ విష్ణు అన్నారు. మంగళవారం ప్రొద్దుటూరులోని అమీర్ సినిమా థియేటర్‌ను హీరో శ్రీ విష్ణుతో పాటు చిత్ర యూనిట్ సందర్శించింది. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాన్ని ఆదరిస్తూ విజయవంతం చేసిన ప్రొద్దుటూరు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణ, అభిమానమే చిత్ర విజయానికి ప్రధాన కారణమని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం హీరో శ్రీ విష్ణు కేక్ కట్ చేసి అభిమానులతో సందడి చేశారు. తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు, ప్రజలు ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దీంతో అమీర్ థియేటర్ వద్ద సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో అమీర్ థియేటర్ యాజమాన్య ప్రతినిధులు అమీర్ బాషా, ఫైరోజ్, జాకీర్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.