SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 8:20 pm Posted by : SALAM PRODDATUR

ఎయిర్‌ఫోర్స్ జవాన్ కిరణ్ మృతికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంతాపం

 

 

సలాం ప్రొద్దుటూరు – మైదుకూరు:

మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన ఎయిర్‌ఫోర్స్ జవాన్ మల్లెబోయిన కిరణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన స్వగ్రామానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

అలాగే మిట్టమానుపల్లె గ్రామానికి చెందిన అరికోటం నారాయణ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.ఈ విషాద సమయంలో మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకాంక్షించారు.