SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:16 am Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో త్వరలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం

 

 

–500 మంది ఉద్యోగుల హాజరు పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఉద్యోగుల హాజరు నమోదును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చిరుకూరి ఆదేశాల మేరకు పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 మంది ఉద్యోగులకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.ఈ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. ప్రభుత్వ నిబంధనలు, అమలులో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా జీతభత్యాల చెల్లింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఫేస్ రికగ్నిషన్ విధానం అమలుతో ఉద్యోగుల హాజరులో పారదర్శకత పెరగడంతో పాటు, విధుల నిర్వహణలో సమయపాలన, పరిపాలనలో జవాబుదారీతనం మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగుల విధుల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని కమిషనర్ తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, పురపాలక పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.