జీవనజ్యోతి విద్యాసంస్థల్లో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు

– అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు సలాం ప్రొద్దుటూరు: స్థానిక జీవనజ్యోతి విద్యాసంస్థల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ వై. అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. దేవీ నవరాత్రుల విశిష్టతను చాటుతూ నవదుర్గల రూపాల్లో విద్యార్థినులు కొలువుదీరగా, ప్రత్యేకంగా ప్రదర్శించిన 'మహిషాసుర మర్దిని' ఘట్టం ఆహూతులను ఎంతగానో అలరించింది. ఇందులో...