శుక్రవారం ప్రొద్దుటూరు నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం
–రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రొద్దుటూరు నూతన బస్టాండ్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రేపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నూతన బస్టాండ్‌ను ప్రారంభించనున్నారు.ఈ మేరకు గురువారం తన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు....