కడపలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు
సలాం ప్రొద్దుటూరు – కడప: కడపలో నూతనంగా నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి నూతన కార్యాలయ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి, జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు.నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించి, సంబంధిత వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తిరుమలేష్, జిల్లా పార్లమెంట్ కమిటీ...