
–హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ ముఖ్య నేతల మర్యాదపూర్వక భేటీ
సలాం ప్రొద్దుటూరు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సోమవారం ప్రొద్దుటూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద వారికి ఘన స్వాగతం లభించింది.స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.ఎస్. ముక్తియర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు బెపారి జాకీర్ అహ్మద్,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు పలువురు ప్రముఖులు, టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ పరిసరాలు టీడీపీ శ్రేణుల సందడితో కళకళలాడాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.సీఎం, డిప్యూటీ సీఎం రాకతో ప్రొద్దుటూరు టీడీపీలో నూతన ఉత్సాహం నెలకొంది.

