SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:27 am Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరు కమిషనర్‌కు ప్రశంసల వెల్లువ

 

–సీఎం, డిప్యూటీ సీఎం సభ విజయవంతంలో ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక

 

–వేలాది మంది తరలివచ్చినా ఎక్కడికక్కడ ‘లైవ్ శానిటేషన్’తో చెత్త తొలగింపు

 

సలాం ప్రొద్దుటూరు :

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కమిషనర్.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్, పైలాన్ ప్రాంతం, డంపింగ్ యార్డు, నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పారిశుధ్య పనులకు ముందస్తు కార్యాచరణ రూపొందించారు.

‘లైవ్ శానిటేషన్’తో తక్షణ స్పందన

బహిరంగ సభ సందర్భంగా ఎక్కడైనా చెత్త పేరుకుపోకుండా ‘లైవ్ శానిటేషన్’ విధానాన్ని అమలు చేశారు. ప్రాంతాల వారీగా పారిశుధ్య సిబ్బంది, కార్మికులను మ్యాపింగ్ చేసి, అవసరమైన ప్రాంతాల్లో తక్షణమే చెత్తను తొలగించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.సభ కొనసాగుతున్న సమయంలోనూ పారిశుధ్య కార్మికులు నిరంతరం విధుల్లో ఉండటంతో చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చినప్పటికీ పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కొనసాగాయి.

ముందస్తు ప్రణాళికతో సమన్వయం

బహిరంగ సభల్లో పారిశుధ్య నిర్వహణ సవాల్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ.. ముందస్తు ప్రణాళిక, సిబ్బంది సమన్వయంతో నిర్వహణను క్రమబద్ధీకరించారు. సభా ప్రాంగణం మాత్రమే కాకుండా నగర పారిశుధ్యం, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్, పైలాన్ ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు.ఈ ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్, సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను అభినందించినట్లు అధికారులు తెలిపారు.భారీ ప్రజాసమ్మర్థం ఉన్న కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, డంపింగ్ యార్డు నిర్వహణ, సభా ప్రాంగణ పారిశుధ్యం, నగర పారిశుధ్య పనులు, హెలిప్యాడ్–పైలాన్ ప్రాంతాల పరిశుభ్రత వంటి అంశాలను సమన్వయంతో నిర్వహించడం ద్వారా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.సభకు ముందు నుంచే చేపట్టిన ఏర్పాట్లు, కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొనసాగించిన ‘లైవ్ శానిటేషన్’ చర్యలు పారిశుధ్య నిర్వహణలో ప్రత్యేకంగా నిలిచాయి.