కూటమితోనే రాయలసీమ అభివృద్ధి
–రాయలసీమను ‘రైజింగ్ సీమ’గా తీర్చిదిద్దుతున్నాం – జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత సలాం ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమకు భారీగా పరిశ్రమలు తరలివస్తుండటంతో యువతకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్లతో అమరజీవి జలధార...