SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:38 am Posted by : SALAM PRODDATUR

సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ

 

 

–ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు

 

సలాం    ప్రొద్దుటూరు:

ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని  మంత్రి  నారాయణ పరిశీలించారు. సభకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మంత్రివర్యులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు వివరించారు.ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారాయణ సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.