ఉత్సాహంగా జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్ పోటీలు

    –రాష్ట్రస్థాయి పోటీలకు 36 మంది క్రీడాకారుల ఎంపిక   సలాం ప్రొద్దుటూరు: స్థానిక జార్జ్ కారోనేషన్ క్లబ్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 బాలబాలికల జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్ పోటీలు క్రీడాకారుల ఉత్సాహభరిత ప్రదర్శనల మధ్య సాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.రైఫిల్ షూటింగ్‌లో ఓపెన్ సైట్, పీప్ సైట్, క్రిస్టల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 పోటీలకు ఎంపిక చేశారు....