SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 3:12 am Posted by : SALAM PRODDATUR

ఉత్సాహంగా జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్ పోటీలు

 

 

–రాష్ట్రస్థాయి పోటీలకు 36 మంది క్రీడాకారుల ఎంపిక

 

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక జార్జ్ కారోనేషన్ క్లబ్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 బాలబాలికల జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్ పోటీలు క్రీడాకారుల ఉత్సాహభరిత ప్రదర్శనల మధ్య సాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.రైఫిల్ షూటింగ్‌లో ఓపెన్ సైట్, పీప్ సైట్, క్రిస్టల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 పోటీలకు ఎంపిక చేశారు. అలాగే ఫెన్సింగ్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 24 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.మొత్తం 36 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 పోటీలకు అర్హత సాధించారు. పోటీల సందర్భంగా క్రీడాకారులు ప్రతిభ, క్రమశిక్షణ, పోటీతత్వాన్ని ప్రదర్శించారు.పోటీలను జార్జ్ కరోనేషన్ క్లబ్ సెక్రటరీ మార్తాల సుధాకర్ రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 సెక్రటరీ మురళీకృష్ణ, పోటీల అబ్జర్వర్ రాఘవేంద్ర, వ్యాయామ సంచాలకులు లవకుశ, నాగేశ్వరరావు, విలోనియారాణి పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు.