SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:09 am Posted by : SALAM PRODDATUR

గెలుపే లక్ష్యం.. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలి– రాచమల్లు

 

 

–వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ

 

సలాం  ప్రొద్దుటూరు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబంధించి ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. దీంతో కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు.పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని పేర్కొంటూ, అందరూ ఐక్యంగా, అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.