హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చు

  –బాలికలకు అవగాహన కల్పించిన వైద్యాధికారులు.. 16 మందికి హెచ్‌పీవీ టీకా   సలాం   ప్రొద్దుటూరు: హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వల్ల సంభవించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ద్వారా గణనీయంగా నివారించవచ్చని ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ గీత తెలిపారు.స్థానిక ఎస్‌వీవీ హైస్కూల్‌, అమృత గార్డెన్స్‌లో బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గీత మాట్లాడుతూ హెచ్‌పీవీ సాధారణంగా కనిపించే వైరస్‌ అని, ఇది చర్మం, జననాంగ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని...