– 2023 ఎన్నికల కమిషన్ నిబంధనలు సవర్ణ చట్టం రద్దు చేయాలి.
–ఎస్.ఐ.ఆర్. బదులుగా ఎస్.ఎస్.ఆర్. తీసుకొని రావాలని….సిపిఎం
సలాం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు:
రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి యేతర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అక్టోబర్ 2 దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వివరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీనామా చేయాలని ఆందోళనలో భాగంగా జమ్మలమడుగు పట్టణంలోనీ గాంధీ విగ్రహం కు పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేసినట్లు స్థానిక సిపిఎం పట్టణ ప్రధాన కార్యదర్శి జి.ఏసుదాసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 ఎన్నికల కమిషన్ నిబంధనలు సవరిస్తూ చేసిన ప్రజాస్వామ్య , రాజ్యాంగ విరుద్ధ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ భిన్నంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల్లో విచారించేటువంటి నిబంధనను తొలగించడం నియంతృత్వ ధోరణికి అవకాశం కల్పించడమే అన్నారు. ఎస్.ఐ.ఆర్. రద్దుచేసి ఎస్.ఎస్.ఆర్. తీసుకురావాలని కోరారు. ఓటు నమోదు, ఓటు తొలగింపు ప్రక్రియలో ఫారం-6 ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా పౌరులను రెండుగా విడగొట్టి, ఓటు ఉన్న పౌరులు, ఓటు లేని పౌరులుగా మారుస్తోందని ఈ నిబంధనను వెంటనే తొలగించాలన్నారు. జడ్- జనరేషన్ ఓటర్లు దేశవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షలు నమోదు చేయలేదని, 13 కోట్ల ఓటర్లు తొలగించారని, మహిళ ఓటర్ల సంఖ్యను గణనీయంగా తొలగించారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని త్వరితగతిన విచారించి తీర్పు ఇవ్వాలన్నారు. ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిటీ లోని ఇద్దరు మెజారిటీ సభ్యుల నిర్ణయానికి భిన్నంగా బిజెపి రాజకీయ ఎన్నికల ప్రయోజనాల కోసం, కేంద్ర ఎన్నికల ప్రధాన ఉన్నతాధికారి నిర్ణయాలు చేయటం, అమలు చేయటం అప్రజాస్వామ్యకమైన చర్య అయినందున కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఏ. వినయ్ కుమార్, నరేంద్ర , దస్తగిరి విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు ఖాదర్ లు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
