SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 11:05 pm Posted by : SALAM PRODDATUR

సీఎం, డిప్యూటీ సీఎం ప్రొద్దుటూరు పర్యటనను విజయవంతం చేయాలి

 

 

–జల జీవన్ మిషన్ ప్రారంభోత్సవ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి

 

 సలాం  ప్రొద్దుటూరు:

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలతో భారత్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి పాల్గొని కూటమి శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 5న నిర్వహించనున్న జల జీవన్ మిషన్ ప్రారంభోత్సవ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను సభకు తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ నాయకులు, వివిధ విభాగాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.