ప్రొద్దుటూరు శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ‘స్వచ్ఛ హాస్పిటల్’ అవార్డు
–జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో ఘనత సలాం ప్రొద్దుటూరు: జిల్లా కలెక్టరేట్ సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో ప్రొద్దుటూరు శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ‘స్వచ్ఛ హాస్పిటల్’ అవార్డును అందుకుంది.ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డుకు సంబంధించిన మెమొంటో, ప్రశంసా పత్రాన్ని శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. భరత్ నారాయణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు స్వీకరించారు.ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, పరిసరాల...