SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:24 pm Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరు శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ‘స్వచ్ఛ హాస్పిటల్’ అవార్డు

 

–జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో ఘనత

 

సలాం   ప్రొద్దుటూరు:

జిల్లా కలెక్టరేట్ సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో ప్రొద్దుటూరు శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ‘స్వచ్ఛ హాస్పిటల్’ అవార్డును అందుకుంది.ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డుకు సంబంధించిన మెమొంటో, ప్రశంసా పత్రాన్ని శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. భరత్ నారాయణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు స్వీకరించారు.ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల్లో మెరుగైన ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డా. భరత్ నారాయణ మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రానికి అవార్డు రావడం సిబ్బంది సమష్టి కృషికి గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.