పారిశుధ్య కార్మికుల పిల్లల కోసం ‘కాఫీ విత్ కమీషనర్’

  –విద్యతోనే సామాజిక స్థాయి, ఆర్థిక ప్రగతి సాధ్యం –కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం  ప్రొద్దుటూరు: పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, కెరీర్‌ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వినూత్నంగా చేపట్టిన ‘కాఫీ విత్ కమీషనర్’ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది.గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీటెక్, డిగ్రీ, ఫార్మసీ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 35 మంది పారిశుధ్య...