SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:18 pm Posted by : SALAM PRODDATUR

28వ సచివాలయ పరిధిలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

–లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

 

సలాం   ప్రొద్దుటూరు:

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు 28వ సచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.చర్చి వీధి, శాంతకుమారి వీధి, మట్టి మసీదు వీధుల్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు నాయకుడు హర్ష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు షేక్ నూర్ మహమ్మద్ (నూరి) ఆధ్వర్యంలో నిర్వహించారు.