SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 12:55 pm Posted by : SALAM PRODDATUR

20వ వార్డులో ఘనంగా NTR భరోసా పెన్షన్ల పంపిణీ

–ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు లాల్అందజేసిన టీడీపీ నాయకులు

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని 20వ వార్డులో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు వార్డులో ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాల ఫలాలను అందించడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జకీర్ అహ్మద్, 20వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి బేపారి ఆరిఫ్ అహ్మద్, బూత్ ఇన్‌చార్జి మాదురు మున్నా, ఖాదర్ బాషా, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.