SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 11:20 am Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరులో NTR భరోసా పెన్షన్ల పంపిణీ

–లబ్ధిదారులతో మమేకమైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్

 

–సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ముందడుగు

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలో గురువారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ డా. వీఎస్‌ ముక్తియార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను కలుసుకున్న ముక్తియార్ వారికి పెన్షన్లను అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమైన ఆయన.. పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ముక్తియార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ముక్తియార్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.