SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 11:09 pm Posted by : SALAM PRODDATUR

69 ఏళ్ల మహిళకు డబుల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌ అమరిక

 

–శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌లో విజయవంతంగా నిర్వహించిన వైద్య ప్రక్రియ

 

–డా. ఇజ్రాయెల్‌ రామనాథన్‌ ఆధ్వర్యంలో చికిత్స

 

సలాం  ప్రొద్దుటూరు:

గుండె సంబంధిత సమస్యతో చికిత్స కోసం వచ్చిన 69 ఏళ్ల మహిళకు ప్రొద్దుటూరులోని శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌లో డబుల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌ నిర్వహించారు.రోగికి నిర్వహించిన వైద్య పరీక్షలు, క్లినికల్‌ మూల్యాంకనం అనంతరం పేస్‌మేకర్‌ అమరిక అవసరమని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డా. ఇజ్రాయెల్‌ రామనాథన్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చింది.కార్డియాలజీ, క్యాథ్‌ ల్యాబ్‌, నర్సింగ్‌ విభాగాలకు చెందిన సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.వైద్య ప్రక్రియ అనంతరం రోగి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో పేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌ వంటి ప్రత్యేక కార్డియాక్‌ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.