పేద కుటుంబాల సొంతింటి కలకు మరో అడుగు!

–సాంబయ్యగారి వీధిలో PMAY–Urban 2.0 మంజూరు పత్రాల పంపిణీ   –లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి   సలాం   ప్రొద్దుటూరు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 (PMAY–Urban 2.0) పథకంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలోని సాంబయ్యగారి వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను...