SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 1:13 pm Posted by : SALAM PRODDATUR

పేద కుటుంబాల సొంతింటి కలకు మరో అడుగు!

–సాంబయ్యగారి వీధిలో PMAY–Urban 2.0 మంజూరు పత్రాల పంపిణీ

 

–లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0 (PMAY–Urban 2.0) పథకంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలోని సాంబయ్యగారి వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు.PMAY–Urban 2.0 ద్వారా పట్టణ ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేని అర్హులైన కుటుంబాలకు గృహ నిర్మాణానికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకం ద్వారా మరిన్ని అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారు.మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.