అవినీతిపై పోరాటం.. ప్రజాధనం ప్రజల హక్కు

–10 ప్రధాన డిమాండ్లతో డిప్యూటీ తహసీల్దార్‌కు MPJ వినతిపత్రం సలాం   ప్రొద్దుటూరు: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించడంతో పాటు అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రొద్దుటూరులో కొనసాగింది.“ప్రజాధనం – ప్రజల హక్కు” అనే నినాదంతో సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా బుధవారం MPJ ప్రతినిధులు ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి డిప్యూటీ తహసీల్దార్ ఏ. కాంత్కు 10 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని...