జిల్లా సమీక్షలో ప్రొద్దుటూరు సమస్యలపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫోకస్

–అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. పెండింగ్‌ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే వరద సలాం ప్రొద్దుటూరు –  కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై మంగళవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల...