SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 5:07 pm Posted by : SALAM PRODDATUR

జిల్లా సమీక్షలో ప్రొద్దుటూరు సమస్యలపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫోకస్

–అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..

పెండింగ్‌ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు –  కడప:

వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై మంగళవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల ప్రగతిని జిల్లా కలెక్టర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం అజెండాలోని అంశాల వారీగా సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, పనుల పురోగతిని ప్రజాప్రతినిధులకు వివరించారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గ అంశాలపై ప్రత్యేకంగా ప్రస్తావన

సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సాగు–తాగునీటి సమస్యలు, రహదారులు, విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చించారు.నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు అవసరమైన ప్రతిపాదనలపై సంబంధిత శాఖలు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని కోరారు.ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నిధిమీనా, ప్రభుత్వ విప్‌, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్, ఎమ్మెల్సీ బి. రాంగోపాల్‌ రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ జయప్రకాష్‌, రాష్ట్ర ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాంప్రసాద్‌, రాష్ట్ర షేక్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వి.ఎస్. ముక్తియార్, శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పి. రమేష్‌ నాయుడు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.