ప్రతిభకు ప్రోత్సాహం.. 48 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.2 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్‌లు
–ప్రతిభకు ప్రోత్సాహం.. 48 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.2 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్‌లు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్, కడప ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువైన మెరిట్ స్కాలర్‌షిప్‌లను సోమవారం పంపిణీ చేశారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం, చివరి సంవత్సరం చదువుతున్న 48 మంది మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందజేశారు.దివంగత వై.వి. నాయుడు కుమారులు వై. వినయ్ కుమార్, డాక్టర్ వై. రామ సంజయ్, కోడలు సి. సునీత, మనుమడు...