పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన తరం
–గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సలాం ప్రొద్దుటూరు –జమ్మలమడుగు: జమ్మలమడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గూడెంచెరువు సెక్టార్ పి. బొమ్మేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్త కె.ఎన్. కుమారి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని...