నైపుణ్యాలతోనే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు
–కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్‌తో పాటు AIపై పట్టు సాధించాలి –వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సలాం ప్రొద్దుటూరు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటే విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సూచించారు. కమ్యూనికేషన్, అనలిటికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.స్థానిక శ్రీకృష్ణగీతాశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘యువత–ఉద్యోగ అవకాశాలు’ కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి...