
–జిల్లా టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సత్కరించిన జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్, మాజీ శాసనమండలి సభ్యులు దీపక్‌రెడ్డిని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దీపక్‌రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలు, జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై నాయకులు పరస్పరం చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ మంచూరి సూర్యనారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, కర్ణాటి అమర్‌నాథ్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

