SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:07 pm Posted by : SALAM PRODDATUR

ఉచిత యునాని వైద్య శిబిరానికి విశేష స్పందన

 

 

–పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

 

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు పట్టణంలోని పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత యునాని వైద్య శిబిరంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ప్రజలకు అందుబాటులో ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

 

ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.శిబిరంలో వైద్యులు అందించిన సేవలను ఆయన పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, అధ్యక్షులు దస్తగిరిరెడ్డి, ట్రెజరర్ లక్ష్మన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.