ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట

–పలు దుకాణాల్లో తనిఖీలు.. వ్యాపారులకు అవగాహన.. ప్లాస్టిక్ సేకరణ –ప్రతి మూడో శనివారం క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ సభ్యులు సిద్ధం: కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం   ప్రొద్దుటూరు: పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ సంకల్ప దీక్ష అడ్వైజరీ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. పట్టణంలోని పలు దుకాణాలను సందర్శించి ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించడంతో పాటు వ్యాపారులకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద లభించిన ప్లాస్టిక్‌ను సేకరించి, ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్...