నంద్యాల–ప్రొద్దుటూరు మీదుగా బెంగళూరుకు కొత్త రైలు నడపాలి
–కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వినతి సలాం ప్రొద్దుటూరు – పొట్లదుర్తి: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కడప జిల్లా పర్యటనలో భాగంగా కడపలో నూతనంగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని శనివారం సందర్శించారు. అనంతరం పొట్లదుర్తి గ్రామంలో సీఎం సురేష్ నాయుడును పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి ను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మచిలీపట్నం–విజయవాడ నుంచి నంద్యాల, ప్రొద్దుటూరు, అనంతపురం మీదుగా బెంగళూరుకు రైలు సౌకర్యం...