కడప విమానాశ్రయ అభివృద్ధికి మరో ముందడుగు
–విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సలాం ప్రొద్దుటూరు –కడప: కడపలో నూతనంగా చేపడుతున్న విమానాశ్రయ అభివృద్ధి పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించి పరిశీలించారు. విమానాశ్రయంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలను ఆయన పరిశీలించారు.ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి సవిత, ఎంపీ సీఎం రమేష్ నాయుడు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీ రాష్ట్ర షేక్ సంక్షేమ...