–విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
సలాం ప్రొద్దుటూరు –కడప:
కడపలో నూతనంగా చేపడుతున్న విమానాశ్రయ అభివృద్ధి పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించి పరిశీలించారు. విమానాశ్రయంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలను ఆయన పరిశీలించారు.ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి సవిత, ఎంపీ సీఎం రమేష్ నాయుడు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీ రాష్ట్ర షేక్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు.కడప విమానాశ్రయ అభివృద్ధి ద్వారా విమాన సౌకర్యాల విస్తరణ, రాయలసీమ ప్రాంతానికి మెరుగైన విమాన కనెక్టివిటీ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత లభించింది.విమానాశ్రయ మౌలిక వసతుల అభివృద్ధి పూర్తయితే కడపతో పాటు రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కడప విమానాశ్రయ అభివృద్ధి పనులపై కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.
