చిన్నారుల సందడితో అంగన్వాడీ ఉత్సవాలు.. జె.కొత్తపల్లిలో ఘనంగా నిర్వహణ
–ఆటపాటలతో అలరించిన చిన్నారులు.. తల్లిదండ్రులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన సలాం ప్రొద్దుటూరు – పెద్దముడియం: మండలంలోని జె.కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ ఉత్సవాలను ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్-కే లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లులు, అంగన్వాడీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉత్సవాలను పురస్కరించుకుని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. చిన్నారుల ఆటపాటలు, సందడితో కేంద్రం కళకళలాడింది. తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు. పౌష్టికాహారంపై అవగాహన అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా చిన్నారులకు అందించాల్సిన...