SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:30 pm Posted by : SALAM PRODDATUR

SRITలో ప్రాంగణ ఎంపికలు.. 15 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

 

సలాం ప్రొద్దుటూరు:

సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SRIT) ఇంజినీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన ట్యాప్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.కళాశాలలోని CSE, ECE, EEE, AIML విభాగాల విద్యార్థులకు నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియలో CSE నుంచి 4 మంది, ECE నుంచి 8 మంది, EEE నుంచి 2 మంది, AIML నుంచి ఒకరు చొప్పున మొత్తం 15 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి తెలిపారు.ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షల ప్యాకేజీ అందనున్నట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ నజీర్ వెల్లడించారు. విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడంలో కళాశాల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీర కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ వీర కళ్యాణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆయా విభాగాల HODలు అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు.