స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం
–ఐకమత్యంతో ప్రజల్లోకి వెళ్లాలి.. –ఓటర్ల జాబితాలను పరిశీలించాలి: ఏ. రామారావు సలాం ప్రొద్దుటూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు ఏ. రామారావు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకుడు, జనసైనికుడు తమకు సంబంధించిన ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజలతో నిరంతరం...