SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 11:13 pm Posted by : SALAM PRODDATUR

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

 

 

–ఐకమత్యంతో ప్రజల్లోకి వెళ్లాలి..

–ఓటర్ల జాబితాలను పరిశీలించాలి: ఏ. రామారావు

 

సలాం   ప్రొద్దుటూరు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు ఏ. రామారావు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకుడు, జనసైనికుడు తమకు సంబంధించిన ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని కోరారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న రామాజీ ప్రసాద్, మంచాల సంజీవ్, మాదాసు మురళి, సుంకర మురళి, పీవోసీ కల్యాణ్ రెడ్డి, సేగిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి, మంచి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.